Father Deceased at Daughter Grave: కూతురుపై ఎనలేని ప్రేమ, సమాధి దగ్గరే ప్రాణాలు విడిచిన ఓ తండ్రి, మచిలీపట్నంలో గుండెను పిండేసే విషాద ఘటన
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో (Machilipatnam) కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన జరిగింది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి ఆమె సమాధి దగ్గరే ప్రాణాలు (Father Deceased at Daughter Grave) విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అనారోగ్యంతో తనువు చాలించడంతో తట్టుకోలేని తండ్రి ఆమెనే తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు.
Machilipatnam, August 26: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో (Machilipatnam) కన్నీళ్లు పెట్టించే విషాద ఘటన జరిగింది. బిడ్డ మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి ఆమె సమాధి దగ్గరే ప్రాణాలు (Father Deceased at Daughter Grave) విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అనారోగ్యంతో తనువు చాలించడంతో తట్టుకోలేని తండ్రి ఆమెనే తలుచుకుంటూ ప్రాణాలు విడిచాడు.
మచిలీపట్నం సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం.. మచిలీపట్నం కుమ్మరిగూడెంలోని జలాల్‌పేటకు చెందిన లక్కోజి గిరిబాబు (52) రోల్డ్ గోల్డ్ పనులు చేస్తుంటాడు.అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు. పిల్లలను ప్రేమగా పెంచుకున్న గిరిబాబు కొంతకాలం క్రితం పెద్ద కుమార్తె రేణుకా దేవికి వివాహం చేశాడు. ప్రసవం నిమిత్తం ఆస్పతిలో చేరిన ఆమె అస్వస్థతకు గురై ఇటీవల మృతి చెందింది. మహద్ భవన ప్రమాదం, శిథిలాల కింద సజీవంగా నాలుగేళ బాలుడు, ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు, మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.1.50 లక్షలు
అప్పటి నుంచి కుమార్తెను తలచుకుంటూ గిరిబాబు పదేపదే రేణుకాదేవి సమాధి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు రాత్రికి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం అనుమానం వచ్చిన బంధువులు శ్మశానం వద్దకు వెళ్లి చూడగా కుమార్తె సమాధి వద్ద గిరిబాబు విగతజీవిగా కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 26, 2020 04:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

