Mumbai, August 26: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ మహద్‌లో ఐదంతుల భవనం కూలిన ఘటనలో (Mahad Building Collapse) మృతుల సంఖ్య 16కు చేరింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నాయి. సోమవారం భవనం కూలగా.. (Raigad Building Collapse ) భవనం కింద సుమారు 75 మంది వరకు చిక్కుకున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో 60 మంది వరకు రక్షించారు.
మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4లక్షలు, గాయపడిన వారికి రూ.1.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇదిలా ఉంటే భవనం నిర్మించిన పదేళ్లకే కూలిందని అధికారులు తెలిపారు. సదరు డెవలపర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి విజయ్ నామ్‌దేవ్‌రావు పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద డెవలపర్‌పై ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు.
రాయ్‌గఢ్ మహద్‌లో భవన నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, తద్వారా నిర్మాణం పూర్తయిన పదేళ్లకే ఈ బిల్డింగ్ కూలిందని మంత్రి తెలిపారు. ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మందిని రక్షించామని పేర్కొన్నారు. ఈ కూలిపోవడానికి సంబంధించి తారిక్ గార్డెన్‌కు చెందిన బిల్డర్, ఆర్కిటెక్ట్ సహా ఐదుగురిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ ఫరూక్ కాజీ, ఆర్ సీసీ కన్సల్టెంట్ బాహుబలి ధమ్నే, ఆర్కిటెక్ట్ గౌరవ్ షాలపై ఐపీసీ 304, 304ఏ, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆ అధికారి తెలిపారు. శిధిలాల కింద మరో 18 మంది, మహారాష్ట్రలో కూలిన ఐదు అంతస్తుల భవనం
భవనం కూలి (Maharashtra Building Collapse) 36 గంటలు దాటినా, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఒక మహిళను సజీవంగా బయటకు తీసుకువచ్చింది. బాధితురాలు 26 గంటల పాటు శిధిలాల కింద చిక్కుకుపోయింది. బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
Update by ANI
#WATCH: A 4-year-old boy was rescued from under the debris at the site of building collapse in Mahad, Raigad. #Maharashtra pic.twitter.com/polMUhzmqN
— ANI (@ANI) August 25, 2020
ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఓ నాలుగేళ్ల బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. ఏకంగా 19 గంటల పాటు దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ఓ నాలుగేళ్ల బాలుడు చివరకు ఎన్డీఆర్ఎఫ్ దళాల సాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. రక్షణ చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిలో మహమ్మద్ నదీమ్ బాంగీని సజీవంగా చూడగానే ఒక్కసారిగా ఆనందం కలిగింది. గ్యాస్ కట్టర్లు, ఇతర యంత్ర సామగ్రిని ఉపయోగించి శిథిలాలను తొలగించారు. జాగ్రత్తగా బయటకు తెచ్చారు. ఊపిరిబిగపట్టి చూస్తున్న స్థానికుల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు. ‘గణపతి బప్పా మోరియా’అంటూ నినదిస్తూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
పదేళ్ల క్రితం మహద్‌లో నిర్మించిన అయిదు అంతస్తుల భవనంలో మొత్తం 45 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలిన విషయం విదితమే.