Gajuwaka Fire Video: విశాఖ గాజువాకలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన మూడు ఫ్లోర్లు, భారీగా ఆస్తి నష్టం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ ఇంజిన్లు

విశాఖలోని గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి.

Gajuwaka Fire Video: విశాఖ గాజువాకలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన మూడు ఫ్లోర్లు, భారీగా ఆస్తి నష్టం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ ఇంజిన్లు
Fire (Photo-Video Grab)

విశాఖలోని గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. బిల్డింగ్‌ వెనుక నివాసాలుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఫైర్‌ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. ఆధునిక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Here's ANI Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 27, 2024 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).