Investments In AP: పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ శ్రామికశక్తి.. జనాభాలో 70 శాతం మంది వర్కింగ్ పాపులేషనే..

పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారుతున్నది. రాష్ట్రంలో మొత్తం 8.5 కోట్లమంది జనాభా ఉంది. ఈ మొత్తం జనాభాలో 70 శాతం మంది పెనిచేసేవారుగా ఉండటం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి.

Investments In AP: పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ శ్రామికశక్తి.. జనాభాలో 70 శాతం మంది వర్కింగ్ పాపులేషనే..
Global Investors Summit 2023 (Photo-Twitter/AP CMO)

Visakhapatnam, Feb 25: పెట్టుబడులకు (Investments) గమ్యస్థానంగా ఏపీ (AP) మారుతున్నది. రాష్ట్రంలో మొత్తం 8.5 కోట్లమంది జనాభా (Population) ఉంది. ఈ మొత్తం జనాభాలో 70 శాతం మంది పెనిచేసేవారుగా ఉండటం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. పనిచేసే శ్రామిక శక్తి ఎక్కువగా ఉంటే, ఉత్పత్తి వ్యయం, సమయం కలిసోస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ (space and defence) , అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్, ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రో కెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్,టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి.

పెట్టుబడులకు స్వర్గధామంగా ఏపీ.. పారిశ్రామికాభివృద్ధికి ఎన్నో అవకాశాలు.. ఏయే రంగాల్లో పెట్టుబడులకు ఏపీ అనువైన ప్రాంతమంటే??

ఇక, దేశంలో విస్తీర్ణ పరంగా ఎనిమిదో పెద్ద రాష్ట్రంగా ఉండటం, విస్తారమైన తీరరేఖ, వాణిజ్య రవాణాకు అన్ని సదుపాయాలు ఉండటం ఏపీ ప్రత్యేకత. అందుకే గడిచిన మూడేండ్లలో ఇప్పటికే రాష్ట్రంలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీలను ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు వచ్చే నెల  3, 4 తేదీల్లో ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు (Global Investor Summit) కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ఏపీ ముస్తాబు.. విశాఖలో విస్తృత ఏర్పాట్లు

(The above story first appeared on LatestLY on Feb 25, 2023 10:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).