Visakhapatnam, Feb 24: వచ్చే నెల 3, 4 తేదీల్లో ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు (Global Investor Summit) కు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు సీఎస్ జవహార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీగ్రౌండ్స్ లో (AU Engineering College Grounds) జరిగే సదస్సు నిర్వహణపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సదస్సులో పాల్గొనే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, ఇతర డెలిగేట్ల అందరికీ ఆహ్వాన పత్రాలు అందించండంతో పాటు వారికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం తగిన రవాణా, వసతి వంటి అన్నిఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు. రెండు రోజులపాటు జరగనున్నఈగ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుల్లో వివిధ సెక్టార్లపై పెద్ద ఎత్తున చర్చ జరగనున్నది.
ముఖ్యంగా ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ , అగ్రి అండ్ పుడ్ ప్రాసెసింగ్, ఏరోనాటికల్ అండ్ ఎలక్ట్రానిక్ వాహనాలు, హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఇక్విప్మెంట్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ప్రాస్ట్రక్చర్, పెట్రో అండ్ పెట్రో కెమికల్స్,రెన్యువల్ ఎనర్జీ,ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్,టెక్స్టైల్స్ అండ్ అపారెల్స్, టూరిజం,స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఐటి అండ్ జిసిసి వంటి రంగాలపై పెద్దఎత్తున చర్చ జరగనున్నది.
#AndhraPradesh Govt held an Industry Meet in #Mumbai as a precursor to #APGIS2023 AP Global Investor Summit in #Vizag on Mar 3/4. Attended by Hon’ble Ministers @BugganaRaja & @gudivadaamar & @AudimulapSuresh - #BuildAP #InvestInAP #AdvantageAP #YSJaganDevelopsAP @Industries_GoAP pic.twitter.com/FleCe6Y0OU
— S. Rajiv Krishna (@RajivKrishnaS) February 21, 2023