Tirumala Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మార్చి నెల రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ కోటా ఈ ఉదయం 10 గంటలకు విడుదల.. నేటి సాయంత్రం శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు

తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Tirumala Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మార్చి నెల రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ కోటా ఈ ఉదయం 10 గంటలకు విడుదల.. నేటి సాయంత్రం శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు
Tirupati Temple | Image Used for Representational Purpose (Photo Credit: PTI)

Tirumala, Feb 24: తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ( March 2023 Tirumala Rs 300 Special Darshan Quota) నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ(TTD) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) అధికారులు వెల్లడించారు. ఇక, మార్చి నెలకుగాను కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవా టికెట్ల కోటాను నేటి సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు.

తిరుమల వెళ్లే వారికి అలర్ట్, మార్చి నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోండి

(The above story first appeared on LatestLY on Feb 24, 2023 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).