శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ( March 2023 Tirumala Rs 300 Special Darshan Quota) శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ(Ttd) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) అధికారులు వెల్లడించారు.
వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మార్చి నెల టికెట్లను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారని తెలిపారు.భక్తులు ఈ విషయాలను గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
తిరుమల(Tirumala) లోని గోకులం కార్యాలయంలో బుధవారం నుంచి ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి (Srivani tickets) టిక్కెట్ల జారీని టీటీడీ పునఃప్రారంభించింది. ఫిబ్రవరి నెలలో ఇప్పటికే 750 టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయగా 28వ తేదీ వరకు రోజుకు 150 శ్రీవాణి టికెట్లను జారీ చేయనున్నారు.మార్చి నుంచి వెయ్యి శ్రీవాణి టిక్కెట్లలో, 500 ఆన్‌లైన్‌లో, 400 తిరుమలలోని గోకులం కార్యాలయంలో, 100 తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టికెట్లు కావలసిన భక్తులు నేరుగా తమ ఆధార్ (Aadhar)కార్డుతో హాజరైతేనే టికెట్లు జారీ చేస్తారని వెల్లడించారు.
వైఎస్సార్ లా నేస్తం మూడో విడత నిధులు విడుదల, లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపిన సీఎం జగన్
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న కంపార్ట్‌మెంట్లలో నాలుగు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (Ttd officials) వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 62,101 మంది భక్తులు దర్శించుకోగా 25,836 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చిందని తెలిపారు.