Newyork, Feb 24: భారత సంతతి పౌరులకు (Indian Origin) అమెరికాలో (America) కీలక పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే, ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు అధ్యక్షుడు బైడెన్ (Biden) ప్రభుత్వంలో కీలక పదవులు పోషిస్తున్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను (Ajay Banga) అమెరికా నామినేట్ చేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్ బంగా పేరును సూచిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రకటించారు. తద్వారా భారతీయుల శక్తిసామర్థ్యాలకు అమెరికా ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోంది.
ఎవరీ బంగా?
అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్ సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రైవేటు ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ లో వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. వ్యాపార, ఆర్థిక రంగంలో ఆయనకు 30 ఏళ్ల విశేష అనుభవం ఉంది. మాస్టర్ కార్డ్ తో పాటు అమెరికన్ రెడ్ క్రాస్, క్రాఫ్ట్ ఫుడ్స్, డౌ ఐఎన్సీ సంస్థల్లో కీలక పదవుల్లో విధులు నిర్వహించారు.
President Joe Biden has announced that the United States is nominating former CEO of Mastercard Ajay Banga to be President of the World Bank: The White House
(File photo) pic.twitter.com/C7eEnn3w4R
— ANI (@ANI) February 23, 2023