అమెరికాలో మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది.దీని ధాటికి దాదాపు 1500కుపైగా విమానాలు రద్దయ్యాయి. 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్ లేకుండా పోయింది. అమెరికా పశ్చిమ తీరం నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా మంచు కురుస్తోంది.లాస్ఏంజెల్స్(Los Angeles) సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి. మిన్నెసోటా(Minnesota)లో పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం(NWS) హెచ్చరించింది.
గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే గాలులతో కలిపి భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రహదారులపై ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా సేఫ్టీ కిట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది.డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ, మినియాపొలిస్, సెయింట్ పాల్, వ్యోమింగ్‌లలోనూ పరిస్థితులు దిగజారాయి. ప్రమాదకర శీతాకాలపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లాస్ ఏంజిల్స్‌లోని వాతావరణశాఖ హెచ్చరించింది.
Here's Update
Heavy Snowfall In US, Massive Power Outage, Over 1,500 Flights Cancelled https://t.co/GFXQYtD9mZ pic.twitter.com/tjWLXzofm4
— NDTV News feed (@ndtvfeed) February 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)