ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్‌ వచ్చే మూడేళ్లలో ఐరోపాలో 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఓ వైపు ఆర్థిక మాంద్య భయాలు, మరో వైపు మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల డిమాండ్‌ దృష్ట్యా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా జర్మనీలో 2,300 మందిని, యూకేలో 200 మందిని తొలగిస్తున్నట్లు ఫోర్డ్‌ వెల్లడించింది. 2035 నాటికల్లా యూరప్‌ అంతటా ఈవీ కార్లను అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)