Janasena - TDP Crisis: చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరి సగం మంత్రి పదవులు దక్కాలి.. అలా ప్రకటన వస్తేనే పొత్తులో ఉండాలి..పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య లేఖ

Harirama Jogayya Letter to Pawan Kalyan: మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య రాసిన లేఖలో.. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా? అని విమర్శించారు.

janasena

Harirama Jogayya Letter to Pawan Kalyan:  మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. పవన్‌ కల్యాణ్‌కు హరిరామజోగయ్య రాసిన లేఖలో.. జనసేనకు 24 సీట్లకు మించి గెలిచే సత్తా లేదా?.. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా.. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా?.. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్‌ చెప్పగలరా?.. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు?.. జనసైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా?.. జనసైనికులకు కావలసింది ఎమ్మెల్యే సీట్లు కాదు.. పవన్‌ పరిపాలన అధికారం చేపట్టడం. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరిసగం మంత్రిపదవులు దక్కాలి.. అలా ప్రకటన వస్తేనే ఓట్ల సంక్షోభానికి తెరపడుతుందని ఆయన తెలిపారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement