Vijayawada Shocker: ఉన్మాదిలా మారిన యువకుడు, ప్రేమించలేదని కత్తితో యువతిపై దాడి, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపిన హోం మంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భయంకరమైన సంఘటన (Vijayawada Ghastly Incident) చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తనతో వచ్చేందుకు తిరస్కరించడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. ఆమె ఇంటికి నేరుగా వెళ్లి ఆ మెను కత్తితో పొడిచి నిర్దాక్షిణ్యంగా (man attacked a girl with knife) చంపేశాడు. తరువాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డాడు.

Vijayawada Shocker: ఉన్మాదిలా మారిన యువకుడు, ప్రేమించలేదని కత్తితో యువతిపై దాడి, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపిన హోం మంత్రి సుచరిత
Knife representational image- Photo- ANI)

Amaravati, Oct 16: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో భయంకరమైన సంఘటన (Vijayawada Ghastly Incident) చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తనతో వచ్చేందుకు తిరస్కరించడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. ఆమె ఇంటికి నేరుగా వెళ్లి ఆ మెను కత్తితో పొడిచి నిర్దాక్షిణ్యంగా (man attacked a girl with knife) చంపేశాడు. తరువాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి (suicide attempt) పాల్పడ్డాడు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. కోవిడ్‌ కారణంగా కళాశాల మూసివేయడంతో ఇంటివద్దనే ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతోంది. తండ్రి జోసెఫ్‌ కారుడ్రైవర్‌. తల్లి కుసుమ గృహిణిగా పనిచేస్తున్నారు. అన్న దినేష్‌వర్మ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు.

అదే ప్రాంతంలోని ఆర్‌సీఎం చర్చి ప్రాంతానికి చెందిన బుడిగి నాగేంద్రబాబు(25) అలియాస్‌ చిన్నస్వామి పెయింటర్‌. స్థానికంగా ఉంటున్న వీరు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమాయణాన్ని పెద్దలు ఒప్పుకోరన్న భయంతో గతేడాది గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ దేవాలయంలో రహస్యంగా పెళ్లి చేసుకుని ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. ఇటీవల తమ పెళ్లి విషయాన్ని నాగేంద్రబాబు దివ్య తల్లిదండ్రులకు చెప్పి తనతో కాపురానికి పంపాలని కోరాడు. పెళ్లి గురించి తెలియని యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ పెళ్లిని అంగీకరించలేదు.

ప్రేమించలేదని పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు, అతను నిప్పటించుకున్నాడు, కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఉన్మాది దారుణ ఘటన

పట్టువదలని నాగేంద్రబాబు పలుమార్లు దివ్య ఇంటికొచ్చి తన వెంట పంపాలంటూ గొడవ చేస్తూనే ఉన్నాడు. ఆమె తల్లిదండ్రులు ససేమిరా అంటూనే ఉన్నారు. ఇక పెళ్లి చేసుకున్న యువతి కూడా తన తల్లిదండ్రులను ఒప్పించే తనను తీసుకెళ్లాలంటూ చెబుతూ వచ్చింది. అయితే ఆమె తల్లిదండ్రులను ఒప్పించడం అసాధ్యమన్న భావనతో నిందితుడు తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయానికొచ్చాడు. గురువారం మధ్యాహ్నం దివ్య ఇంటికెళ్లాడు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు లేరు. తన వెంట రావాలని పట్టుబట్టగా దివ్య అంగీకరించకపోవడంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె మెడ, ఎడమ చేయి, మణికట్టు, కుడి పక్కటెముక, పొట్టలో 11 పోట్లు పొడిచాడు. దివ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

వెనువెంటనే అదే కత్తితో తానూ మెడ, మణికట్టు, పొట్ట భాగాల్లో పొడుచుకున్నాడు. కాసేపటికి దివ్య తల్లి వచ్చేసరికి ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న మాచవరం పోలీసులు ఇద్దరినీ తొలుత ఈఎస్‌ఐ ఆస్పత్రికి.. తర్వాత మెరుగైన చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్‌)కి తరలించారు. అక్కడ దివ్య మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన నాగేంద్రబాబుకు అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. అయితే దివ్య, నాగేంద్రబాబు పెళ్లిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ పెళ్లాడారన్న కథనాలను దివ్య కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు.

ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి స్పందించారు. ప్రేమోన్మాది ఘాతుకం ఘటన చాలా బాధాకరమని, ఇటువంటి ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.

కాగా,విజయవాడలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని రెండు రోజుల క్రితం నాగభూషణం అనే వ్యక్తి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్న నాగభూషణం... ఆమె ఎంతకీ తన ప్రేమను అంగీకరించట్లేదన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు

(The above story first appeared on LatestLY on Oct 16, 2020 08:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).