DSP Transfers in AP: 77 మంది డీఎస్పీలను బదిలీ చేసిన జగన్ సర్కారు, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్‌డీపీఓగా బదిలీ అయ్యారు.
VJY, April 26: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్‌డీపీఓగా బదిలీ అయ్యారు.
కాశీబుగ్గలో ఎస్‌డీపీఓగా విధులు నిర్వహిస్తున్న శివరాం రెడ్డికి విశాఖ నార్త్ ఏసీపీగా, అలాగే హర్బర్ ఏసీపీగా పనిచేస్తున్న శిరీషకి నెల్లూరు జిల్లాకి బదిలీ అయ్యింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు ట్రాన్స్‌ఫర్ అయిన అధికారులంతా నార్త్ విశాఖ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఏసీసీ శ్రీనివాసరావుకి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
బదిలీ అయిన వారిలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు, 70 మంది డీఎస్పీలు ఉన్నారు. ఉత్తర్వుల కాపీ ఇదిగో.. మొత్తం 55 పోలీసు సబ్‌డివిజన్‌లకు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని బదిలీ చేసి ఆ స్థానాల్లో వేరే వారిని సబ్ డివిజినల్ పోలీసు అధికారులు (ఎస్‌డీపీవీ), ఏసీపీ, ఏస్పీలు(ఐపీఎస్)గా నియమించారు.
(The above story first appeared on LatestLY on Apr 26, 2023 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

