మహారాష్ట్ర రైతు సీఎం జగన్ పై అభిమానంతో మహారాష్ట్ర నుంచి సైకిల్ తొక్కుతూ తాడేపల్లికి చేరుకున్నారు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నా, ఆయన విధానాలు అన్నా లక్ష్మణ్ కాక్డే ఎంతో అభిమానించేవాడు. దాంతో జగన్ ను ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు.
ఈ నెల 17న మహారాష్ట్రలోని తన స్వస్థలం నుంచి ఓ సైకిల్ పై బయల్దేరాడు. 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తాడేపల్లి చేరుకున్నాడు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి మురిసిపోయాడు. కాక్డే గురించి తెలుసుకున్న సీఎం జగన్ ఆ రైతును ఆప్యాయంగా ఆహ్వానించారు. అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, రైతు కాక్డే జగన్ బొమ్మ ఉన్న టీషర్టు ధరించాడు. దానిపై కాబోయే ప్రధాని జగన్ అంటూ రాసి ఉంది.
Here's AP CMO Tweet
క్యాంప్‌కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన మహారాష్ట్రకు చెందిన రైతు కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే. ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానంతో మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా నుంచి 800 కి.మీ. సైకిల్ తొక్కుతూ తాడేపల్లి వచ్చిన కాక్డే. pic.twitter.com/8lWEUJ4Naq
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)