New Dress Code For Medicos In AP: ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించొద్దని ఆదేశం.. మహిళా విద్యార్థులు తప్పనిసరిగా చీర లేదంటే చుడీదార్‌తో రావాలని ఆదేశం.. పురుషులు క్లీన్ షేవ్‌తో రావాలని సూచన

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులకు కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వాళ్లు ధరించలేరు. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా ఇష్టమైన జీన్స్ ధరించలేరు.

New Dress Code For Medicos In AP: ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించొద్దని ఆదేశం.. మహిళా విద్యార్థులు తప్పనిసరిగా చీర లేదంటే చుడీదార్‌తో రావాలని ఆదేశం.. పురుషులు క్లీన్ షేవ్‌తో రావాలని సూచన
Representational Image (Credits: Facebook)

Vijayawada, Dec 2: ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) వైద్య విద్యార్థులకు (Medical Students) కొత్త డ్రెస్ కోడ్ (New Dress Code) నిబంధనలు (Rules) అమల్లోకి వచ్చాయి. ఇకపై జీన్స్ ప్యాంట్లు (Jeans), టీ షర్టులు (T-Shirts) వాళ్లు ధరించలేరు. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా ఇష్టమైన జీన్స్ ధరించలేరు. ఇకపై మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు మాత్రమే ధరించాలంటూ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) ఆదేశాలు జారీ చేసింది.

8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. వరి కోతల వేళ రైతుల ఆందోళన.. ఏపీలో ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుందన్న ఐఎండీ

అలాగే, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయవద్దని సూచించింది. అలాగే, తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని ఆ ఆదేశాల్లో  పేర్కొంది. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తిలోదకాలివ్వడంతో గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే, బోధనాసుపత్రులకు రోగులు వస్తే కనుక వారికి సహాయకులు లేరన్న కారణంతో వారిని చేర్చుకోవడం మానొద్దని సూచించింది.

(The above story first appeared on LatestLY on Dec 02, 2022 09:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).