National Handloom Day: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు, జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

జయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు.

National Handloom Day: చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్లు, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు, జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి
Chandrababu (photo-Video Grab)

Vjy, August 7: విఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ వైసీపీ సర్కారు రద్దు చేసిందని మండిపడ్డారు. కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తామని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్‌ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ అగ్రస్థానం కల్పించిన పార్టీ మాది. బీసీలు.. ఆది నుంచీ పార్టీకి అండగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తాం. చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. వారికి ఆరోగ్యబీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ తొలగించకుంటే రియంబర్స్‌ చేస్తాం. నేతన్నలకు రూ.67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తామని తెలిపారు.  మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం, తక్కువ ధరకే నాణ్యమైన మద్యం, ఏపీ క్యాబినెట్‌ సమావేశం హైలెట్స్ ఇవిగో..

నేతన్నలు సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయం చేస్తాం. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలి. చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యత. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిస్తున్నా. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తాం. చేనేత మరమగ్గాల కార్మికులకు, సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందిస్తాం. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తాం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).