Arrest Warrant On Amarnath: మంత్రి అమర్‌నాథ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. ఎంధుకంటే??
ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 11 ఏప్రిల్ 2018లో అమర్‌నాథ్ విశాఖ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత..
Vijayawada, March 4: ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై (Gudivada Amarnath) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status), విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 11 ఏప్రిల్ 2018లో అమర్‌నాథ్ విశాఖ రైల్వే స్టేషన్‌లోకి (Visakha Railway station) ప్రవేశించారు. విశాఖ-పలాస రైలును అడ్డుకుని రైల్‌రోకో నిర్వహించారు. ఈ ఘటనపై అమర్‌నాథ్ పై ఆర్పీఎఫ్ అధికారులు కేసు నమోదు చేశారు. కేసు విచారణకు అమర్‌నాథ్ హాజరు కాకపోవడంతో మంత్రిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.
(The above story first appeared on LatestLY on Mar 04, 2023 09:21 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

