Road Accident In Nandyal: నంద్యాల‌లో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం, పెళ్లైన వారం రోజుల‌కే న‌వ‌దంప‌తుల మృతి, తిరుమ‌ల వెళ్లివ‌స్తుండ‌గా యాక్సిడెంట్, ఐదుగురు మృతి

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident In Nandyal) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనుకాల వేగంగా వచ్చిన కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి (5 Dead) చెందారు.

Road Accident In Nandyal: నంద్యాల‌లో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం, పెళ్లైన వారం రోజుల‌కే న‌వ‌దంప‌తుల మృతి, తిరుమ‌ల వెళ్లివ‌స్తుండ‌గా యాక్సిడెంట్, ఐదుగురు మృతి
Road Accident In Nandyala (PIC@ X)

Nandyal, March 06: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident In Nandyal) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనుకాల వేగంగా వచ్చిన కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి (5 Dead) చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Telangana Fire: నాచారంలో భారీ అగ్ని ప్రమాదం, శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో.. 

సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన రవీందర్ కుమారుడు బాల కిరణ్ కు గతనెల 29న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కావ్యతో వివాహం జరిగింది. ఈనెల 3న శామీర్ పేటలో ఘనంగా రిసెప్షన్ జరిపించారు. 4వ తేదీన నూతన దంపతులతో పాటు రవీందర్, అతని భార్య లక్ష్మీలు కారులో తిరుమల దర్శనానికి వెళ్లారు. తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనకాల నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్, అతని భార్య లక్ష్మీ, నవదంపతులు బాల కిరణ్, కావ్య, రవీందర్ మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కారు వేగంగా ప్రయాణిస్తుండటంతోపాటు, కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

(The above story first appeared on LatestLY on Mar 06, 2024 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).