Skill Development Scam Case: గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న చంద్రబాబు, బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
Vjy, Nov 15: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.
చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించాం. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. ఐదు వారాల పాటు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చాం. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయి.
మధుమేహం అదుపులో ఉంది.. జాగ్రత్తలు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం’’ అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. తదుపరి విచారణ రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు వింటామని ధర్మాసనం తెలిపింది.
(The above story first appeared on LatestLY on Nov 15, 2023 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

