Sajjala on Chandrababu Arrest: ఇంట్లో ఉంచేదానికి అరెస్ట్‌ చేయడం ఎందుకు, చంద్రబాబు అరెస్ట్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని.. వాళ్ల దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Sajjala on Chandrababu Arrest: ఇంట్లో ఉంచేదానికి అరెస్ట్‌ చేయడం ఎందుకు, చంద్రబాబు అరెస్ట్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy (Photo-Twitter)

Vjy, Sep 13: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని.. వాళ్ల దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సజ్జల.. టీడీపీ విమర్శలకు ఆధారాలతో సహా కౌంటర్‌ ఇచ్చారు.

‘‘టీడీపీ ప్రభుత్వంలో డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. స్కిల్‌ స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం వాటిల్లింది. దోచుకోవడానికే ఓ స్కీమ్‌ పెట్టారు. షెల్‌ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చుకున్నారు. వందల కోట్లు కొల్లగొట్టి.. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. నేషనల్‌ ఏజెన్సీలు కూడా దోపిడీ రిపోర్ట్‌ ఇచ్చాయి.

జీవోల్లో 13 చోట్ల చంద్రబాబు స్వహస్తాలతో చేసిన సంతకాలు, కేబినెట్‌ అనుమతి లేకుండానే కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని తెలిపిన ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌

2019 ఏప్రిల్‌లోనే సీమెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. సీమెన్స్‌ ప్రతినిధులు మాకు సంబంధం లేదని చెబుతున్నారు. ఎలాంటి అగ్రిమెంట్‌ చేసుకోలేదని అంటున్నారు. అసలు మాకు డబ్బు రాలేదని సీమెన్స్‌ సంస్థ అంటోంది. డబ్బు టెక్‌డిజైన్‌కు వెళ్లింది.. అక్కడి నుంచి షెల్‌ కంపెనీలకు వెళ్లింది. ఈడీ కూడా హవాలా వ్యవహారంపై దర్యాప్తు చేసింది. ఈడీ విచారణ ఎదుర్కొన్న డిజైన్‌టెక్‌​ వాళ్లవి దబాయింపులు కావా? అని సజ్జల నిలదీశారు.

2014 సెప్టెంబర్‌లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. గంటా సుబ్బారావును దానికి ఎండీని చేశారు. 2015లో దాని పేరును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌గా మార్చారు. ఒక చిన్న కంపెనీ ఎండీని చంద్రబాబు లింక్‌ ఎందుకు చేశారు?. షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించింది నిజమా? కాదా?. జాతీయ, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు స్కిల్‌ స్కాం కేసు ఓ కేస్‌ స్టడీగా పనికి వస్తుంది అని సజ్జల అభిప్రాయపడ్డారు.

బాబు జైల్లో ఉండడమే తప్పైనట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. హౌజ్‌ కస్టడీలో ఉంటే దాన్ని అరెస్ట్‌ అంటారా? ఇంట్లో ఉంచేదానికి అరెస్ట్‌ చేయడం ఎందుకు? బాబును హింసిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దొంగల్ని పట్టుకుంటే ఎందుకంత హడావిడి. టీడీపీ, యెల్లో మీడియా తెగ హడావిడి చేస్తున్నాయి. ఆ హడావిడితో అసలు విషయం పక్కకి పోతోంది. కోర్టు కూడా ఏకీభవించాక.. ఈ హడావిడి ఎందుకు?. గోబెల్స్‌ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు అయిపోవు. దేశంలో ఉండే చట్టాలకు చంద్రబాబు అతీతుడా? అని టీడీపీ నిలదీశారు సజ్జల.

సానుభూతి, రాజకీయ ప్రయోజననాల కోసమే బాబు పాకులాడారు. యువత పేరు చెప్పి చంద్రబాబు దోచుకున్నారు. దొంగను అరెస్ట్‌ చేస్తే మానవహక్కుల ఉల్లంఘనా?. అని మండిపడ్డారాయన. అయినా.. అరెస్ట్‌ అయ్యాక ఎవరికీ ఇవ్వని సౌకర్యాలు చంద్రబాబుకి కల్పించారు అని సజ్జల తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 13, 2023 07:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).