Balu Statue: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం.. అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చర్య.. కళాకారులు ఆగ్రహం

గుంటూరులో గతంలో కళా దర్బార్ సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించడం వివాదాస్పదమైంది.

Balu Statue: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం.. అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చర్య.. కళాకారులు ఆగ్రహం
Balu (Photo Credits: Google)

Vijayawada, October 4: గుంటూరులో (Guntur) గతంలో కళా దర్బార్ సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) విగ్రహం (Statue) ఏర్పాటు చేశారు. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Cooperation) అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించడం వివాదాస్పదమైంది. బాలు విగ్రహం తొలగింపు పట్ల కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళా దర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు స్పందిస్తూ, మహాగాయకుడి విగ్రహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షాలు, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేసింది ఒక్క గుంటూరులోనే అని వెల్లడించారు. గుంటూరులో 200కి పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని, బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

(The above story first appeared on LatestLY on Oct 04, 2022 08:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).