Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం విధివిధానాలు ఖరారు, ఆధార్ కార్డుతో పాటూ ఇవి ఉండాల్సిందే! పూర్తి వివరాలిగో!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం (Thalliki Vandanam Scheme) కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి
Vijayawada, July 11: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం (Thalliki Vandanam Scheme) కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ పథక లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ కార్డుతో (Aadhar Card) పాటు ప్రభుత్వ గుర్తింపుతో ఉన్న ఇతర కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద రూ.15 వేలతో పాటు విద్యార్థులకు బ్యాగు, బూట్లు, బెల్టు, సాక్సులు, పుస్తకాలు, యూనిఫాం ఇస్తారు. YSRCP Suspended PV Sidda Reddy: ఏరివేత మొదలు పెట్టిన జగన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని నిర్థారణ
లబ్ధిదారులు ఐడెంటిటీగా కింది వాటిలో ఏదైనా ఒకదాన్ని వాడొచ్చు
ఆధార్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
ఫొటో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్
పాన్ కార్డు
రేషన్ కార్డు
ఓటర్ ఐడెంటిటీ కార్డు
ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్డు
ఫొటో ఉన్న కిసాన్ కార్డు
గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ అఫిషియల్ లెటర్ హెడ్
ఏదైనా డిపార్ట్మెంట్ డాక్యుమెంట్
(The above story first appeared on LatestLY on Jul 11, 2024 02:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

