YSR Congress Party Suspended Former Kadiri MLA PV Sidda Reddy due to anti-Party activities.jpg

Kadiri, July 10: వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిపై వైసీపీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలి ఎన్నికల్లో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు గుర్తించారు. దాంతో సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఆదేశాలు రావడంతో సిద్ధారెడ్డిని సస్సెండ్ నుంచి చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.  వీడియో ఇదిగో, 2029లో ఏపీ సీఎంగా షర్మిల, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ, సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

2024 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధారెడ్డికి వైసీపీ హైకమాండ్ టికెట్ నిరాకరించింది. కదిరి టికెట్ ను మైనారిటీ నేత మక్బూల్ అహ్మద్ కు కేటాయించింది. మక్బూల్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, సిద్ధారెడ్డి... మక్బూల్ అహ్మద్ కు వ్యతిరేకంగా పనిచేశారంటూ వైసీపీ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన వైసీపీ క్రమశిక్షణ కమిటీ... అవి నిజమేనని తేల్చి, పార్టీ అధ్యక్షుడు జగన్ కు సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే సిద్ధారెడ్డిపై వేటు పడింది.