Tenali Shocker: తొలి రాత్రే భర్త నపుంసకుడు అని తెలియడంతో షాక్ తిన్న వధువు, తల్లిదండ్రులకు చెప్పుకుని భోరున విలపించిన యువతి, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
తెనాలితో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఎన్‌ఆర్‌ఐ సంబంధం అంటూ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తొలి రాత్రి భర్త తాను నపుంసకుడినని చెప్పడంతో పెళ్లైన యువతి ఒక్కసారిగా కంగుతింది. ఆ తరువాత అదనపు కట్నం తెస్తే కాపురానికి తీసుకెళతానని భార్య, ఆమె తరఫు వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటీవల ఆమెపై దాడికి సైతం పాల్పడ్డాడు.
Tenali, June 9: తెనాలితో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఎన్‌ఆర్‌ఐ సంబంధం అంటూ యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తొలి రాత్రి భర్త తాను నపుంసకుడినని చెప్పడంతో పెళ్లైన యువతి ఒక్కసారిగా కంగుతింది. ఆ తరువాత అదనపు కట్నం తెస్తే కాపురానికి తీసుకెళతానని భార్య, ఆమె తరఫు వారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా ఇటీవల ఆమెపై దాడికి సైతం పాల్పడ్డాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీసులను (Young Woman Complained On Husband) ఆశ్రయించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తెనాలి (Tenali) సమీపంలోని పినపాడుకు చెందిన 20 ఏళ్ల యువతికి (Young Woman) విజయవాడ ఆటోనగర్‌కు చెందిన ప్రైవేటు కన్సల్టెన్సీలో పనిచేసే యువకుడితో ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన తెనాలిలో వివాహం జరిగింది. వరుడి తల్లిదండ్రులు పెళ్లి కొడుకు త్వరలో చదువు కోసం కెనడా వెళతాడని, అక్కడే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటాడని, పెళ్లి చేసుకుని భార్యనూ తీసుకెళతాడని చెప్పారు.వీసా, ఇతర పత్రాలన్నీ చూపించడంతో వధువు తల్లిదండ్రులు మంచి సంబంధం అని చెప్పి సుమారు రూ.10 లక్షల కట్నం, ఇతర లాంఛనాల కింద మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి అమ్మాయి తరపు వారు వివాహం చేశారు.
వివాహం జరిగిన రోజు తొలి రాత్రి కార్యం నిమిత్తం వధువును (Bride) విజయవాడ తీసుకువెళ్లారు. తొలిరాత్రి గదిలోకి వెళ్లిన ఆమెకు భర్త (Husband) తాను నపుంసకుడినని, సంసారానికి పనికిరానని చెప్పడంతో ఒక్కసారిగా కంగుతింది. అతను బయట ఎవరికీ చెప్పవద్దని భార్యను ప్రాధేయపడ్డాడు. మరుసటి రోజు విజయవాడలో వరుడి తల్లిదండ్రులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌కు వచ్చిన తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు వధువు అసలు విషయం చెప్పుకుని భోరున విలపించింది. దీంతో వధువు తల్లిదండ్రులు తమ కుమార్తెను తెనాలిలోని పుట్టింటికి తీసుకొచ్చేశారు.
అనంతరం ఇరుపక్షాల పెద్దలు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఇటీవల విజయవాడలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా, రిసెప్షన్ కోసం తాము రూ.8 లక్షలు ఖర్చు పెట్టామని, వాటిని తిరిగి ఇవ్వాలని యువకుడు, అతని తరఫు వారు డిమాండ్ చేశారు. అంతకు కొద్ది రోజుల ముందు తెనాలి పినపాడుకు వచ్చిన వీరు, యువతి, ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తెనాలి త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.విజయ్‌కుమార్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jun 09, 2021 05:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

