'Marriage Scam': 19 మంది భర్తలు ఉన్నా మళ్లీ పెళ్లికి రెడీ అయిన భార్య, సోషల్ మీడియాలో వేరే వ్యక్తితో పెళ్లి వీడియో చూసి షాక్ అయిన భర్త, పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు, చైనాలో వైరల్ ఘటన

Bejing, June7: చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన భార్య వేరే వ్యక్తిని పెళ్లి husband catches his wife marrying another man) వీడియోని సోషల్ మీడియాలో చూసిన భర్త ఖంగుతిన్నాడు. ఆ వీడియోలో ఉన్నది తన భార్యే అని తెలుసుకున్నాక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనా మీడియా ప్రకారం.. చైనా మంగోలియాలోని బ‌యాన్నూర్ కు చెందిన ఓ వ్య‌క్తి ఈ ఏడాది జ‌న‌వ‌రిలో పెళ్లికోసం ఓ మ్యారేజ్ బ్యూరోని ఆశ్ర‌యించాడు. వ్య‌క్తి కోరుకున్న‌ట్లు మ్యారేజ్ బ్యూరో ప్ర‌తినిధులు గ‌న్సు అనే ప్రాంతంలోఓ సంబంధాన్ని చూశారు.

అమ్మాయి బాగుంది. అయితే వరుడిని ఎదురు క‌ట్నం కింద 148,000 యువాన్లు (రూ.16.9ల‌క్ష‌ల ) అడుగుతుందని వారు తెలిపారు. అందుకు అంగీకరించిన పెళ్లికొడుకు అమ్మాయి నచ్చడంతో రూ.16.9ల‌క్ష‌లు ఎదురు క‌ట్నం కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. వివాహం సాంప్ర‌దాయ బ‌ద్దంగా అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి త‌రువాత నూత‌న వ‌ధువరులు రెండు నెలల పాటు బాగానే ఉన్నారు. అయితే పెళ్లైన రెండు నెల‌ల త‌రువాత భార్య తన భర్తతో.. ఏవండి ! మ‌న పెళ్లై రెండు నెల‌ల అవుతుంది. మా అమ్మా నాన్న గుర్తుకొస్తున్నారు. మీరు అనుమ‌తి ఇస్తే ఓ సారి పుట్టింటికి వెళ్లాల‌ని అనుకుంటున్నానని తెలిపింది.

అది దెయ్యమా లేక ఏలియనా, హజారిబాఘ్ సమీపంలో బ్రిడ్జ్​ మీద వింత ఆకారం, మతిస్థిమితం లేని వ్యక్తి నగ్నంగా తిరిగి ఉంటాడని చెబుతున్న పెలావాల్​ స్టేషన్ ఇన్​ఛార్జి వికర్ణ కుమార్

పెళ్లై రెండు నెల‌ల‌ు కావడంతో భార్య మ‌న‌స్సు నొప్పించ‌డం ఇష్టం లేక‌ ఆమెను వాళ్ల అమ్మగారింటికి పంపాడు ఇక్కడే ట్విస్టు చోటు చేసుకుంది..రోజులు గ‌డుస్తున్నా భార్య పుట్టింటి నుంచి రావ‌డం లేదు. అదే స‌మ‌యంలో ఓ రోజు ఇంట్లో భర్త సోష‌ల్ మీడియాను ( social media) బ్రౌజ్ చేస్తుండ‌గా త‌న భార్య మ‌రొకరిని వివాహం చేసుకున్న (wife marrying another man) వీడియోల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ ఆధారాల‌తో స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

విమానంలోనే పెళ్లి తంతును పూర్తి చేసిన జంట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, తమిళనాడు మధురై నుంచి బెంగుళూరు మీదుగా సాగిన పెళ్లి విమానం

ఈ ద‌ర్యాప్తులో పోలీసులు, భ‌ర్త విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. డ‌బ్బుల కోసం మ్యారేజ్ బ్యూరో ప్ర‌తినిధులు భారీ ఎత్తున మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు తేలింది.పెళ్లికి ముందే ఎదురు క‌ట్నం తీసుకోవ‌డం. పెళ్లి త‌రువాత ప‌త్తాలేకుండా పోవ‌డం.. పారిపోయి మ‌రొక‌రిని పెళ్లి చేసుకోవ‌డం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెళ్లి కాని 19మంది యువ‌కుల్ని పెళ్లి చేసుకుంద‌ని, వారి వ‌ద్ద నుంచి రూ. 2.28కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులైన మ్యారేజ్ బ్యూరో ప్ర‌తినిధి లీ తో పాటూ మ‌రో ఇద్ద‌రు స‌భ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.