Tirumala Srivari Properties: రూ.15వేల కోట్ల నగదు, 10వేల కేజీలకు పైగా బంగారం, వేంకటేశ్వరస్వామి ఆస్తులు ప్రకటించిన టీటీడీ, మూడేళ్లలోనే భారీగా పెరిగిన తిరుమల శ్రీవారి సంపద, ఏయే బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ చేశారో తెలుసా?

2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపింది. టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రచారం అవాస్తవమని వెల్లడించింది. టీటీడీ ఇలా ఎప్పుడూ చేయదని తెలిపింది.

Tirumala (File Image)

Tirupati, NOV 05: తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirumala Sri Venkateswara Swamy) ఆస్తులు అన్నీ ఇన్నీకావు. నగదు, బంగారం, వజ్రాలు,అత్యంత విలువైన రత్నాలు ఇలా వెంకన్న ఆస్తులకు కొదువేలేదు. రాజుల కాలంనాడు పలువురు రాజులు..చక్రవర్తులు..జమిందారులు ఇచ్చిన విలువైన వజ్రవైఢూర్యాలతో పాటు భక్తులు వెంకన్నకు సమర్పించుకునే కానుకలు (Gifts) అత్యంత భారీగా ఉంటాయి. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించి బంగారం,నగదు వంటి ఆస్తులకు (Asserts) సంబంధిచి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్ ఉన్నాయని తెలిపింది. మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్ ఉన్నట్టుగా తెలిపింది. బంగారం 10,258.37 కేజీల బంగారం ఉన్నాయని..మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని టీటీడీ (TTD) పేర్కొంది.

TTD Sarva Darshan Tokens: టీటీడీ సర్వదర్శనానికి వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి, ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసిన హైకోర్టు 

2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపింది. టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రచారం అవాస్తవమని వెల్లడించింది. టీటీడీ ఇలా ఎప్పుడూ చేయదని తెలిపింది.

TTD Budget 2020-21: టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3309 కోట్లు, గతేడాది కంటే రూ.66 కోట్లు అధికం, ఆమోదం తెలిపిన పాలక మండలి  

సెప్టెంబర్ 30/ 2022 నాటికి జాతీయ బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు రూ.15,938, 68 కోట్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5358.11కోట్లు

యూనియన్ బ్యాంక్- 1694.25 కోట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా- 1839.36 కోట్లు

కెనరా బ్యాంకు 1351 కోట్లు

యాక్సిస్ బ్యాంక్ – 1006.20 కోట్లు

HDFC లిమిటెడ్ 2122.85 కోట్లు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ 555.17 కోట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 660.43 కోట్లు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 306.31 కోట్లు

ఇండియన్ బ్యాంక్ 101.43 కోట్లు

ఐసిఐసిఐ బ్యాంక్ 9.70 కోట్లు

సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 99.91 కోట్లు

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ 18.54 కోట్లు

సెంట్రల్ బ్యాంక్ 1.28 కోట్లు

కరూర్ వైశ్యా బ్యాంక్ 4.37 కోట్లు

ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 4.00 కోట్లు

ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ 1.30 కోట్లు

వివిధ బ్యాంకుల్లో శ్రీవారి బంగారం డిపాజిట్లు మొత్తం 10,258.37 కేజీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9819.38 కేజీలు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 438.99 కేజీలు

(The above story first appeared on LatestLY on Nov 05, 2022 05:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).