TTD Online Quota Tickets: నిమిషాల్లో ముగిసిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్, జనవరి కోటాను విడుదల చేసిన టీటీడీ, ప్రత్యేక దర్శనం, సర్వ టికెట్లు మొత్తం బుక్
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అయ్యాయి. జనవరి నెల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(Special Entry Darshan)ను, సర్వ దర్శనం(sarva darshan) టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేయగా(TTD released online tickets) కేవలం 55 నిమిషాల్లోనే 4లక్షల 60వేల టికెట్లు బుక్ అయ్యాయి.
Tirupati December 24: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అయ్యాయి. జనవరి నెల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(Special Entry Darshan)ను, సర్వ దర్శనం(sarva darshan) టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేయగా(TTD released online tickets) కేవలం 55 నిమిషాల్లోనే 4లక్షల 60వేల టికెట్లు బుక్ అయ్యాయి.
Vaikunta Ekadasi On Jan-13.
Check Out SED 300 Tickets Info: https://t.co/sa4yyYHoEQ pic.twitter.com/z6LxxjSTwl
— TTD Seva (@ttd_seva) December 24, 2021
శుక్రవారం నాడు టీటీడీ ఆన్‌లైన్‌లో శుక్రవారం 4లక్షల 60 వేల టికెట్లను విడుదల చేసింది. ఒక్కసారిగా దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్‌సైట్‌కి 14 లక్షల హిట్లు వచ్చాయి. 55 నిముషాల వ్యవధిలోనే 4 లక్షల 60 వేల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.
జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు, జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు, 23 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 12 వేలు చొప్పున దర్శన టికెట్లను విడుదల చేసింది టీటీడీ. కాగా, జనవరికి సంబంధించి 1, 2, 13 నుంచి 22, 26 తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ గురువారం ఆన్‌లైన్‌లో విడుదల చేయగా, నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు.
(The above story first appeared on LatestLY on Dec 24, 2021 11:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

