Andhra Pradesh: ప్రజల తరఫున గొంతుక వినిపించేందుకు ప్రతిపక్షం ఉండాల్సిందే, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్, ఇంకా ఏమన్నారంటే..
శాసనసభలో నాకు ప్రతిపక్ష నేత హోదానివ్వాల్సిన అవసరం గురించి నేను గతనెల 24న స్పీకర్‌కు అన్ని వివరాలతో లేఖ రాశాను. నిజానికి.. ఆయన మొదటినుంచీ నాపట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానే తప్ప చనిపోలేదని ఒకసారి.. నేను చచ్చేవరకు కొట్టాలని మరోసారి ఆయనన్నారు.
Vjy, July 24: చట్ట ప్రకారం అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శానసనభ పక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసన సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత హోదానిచ్చే విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మౌనం పాటిస్తున్నారని వైసీపీ అధినేత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల కూడా ఈ విషయంలో ముందుగానే స్పందించారని.. దీనిని బట్టి ప్రతిపక్ష నేత హోదా విషయంలో వారు ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతోందని పిటిషన్లో పేర్కొన్నారు.
శాసనసభలో ప్రతిపక్షం, ప్రతిపక్ష నేత ఉండటం ఎంతో అవసరమన్నారు. ప్రజలందరి సమస్యలను లేవనెత్తేందుకు, రాష్ట్రంలో న్యాయ పాలన సక్రమంగా సాగేలా చూసేందుకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిన అవసరముందని జగన్ తన వ్యాజ్యంలో వివరించారు. విస్తృతాధికారంతో అధికారాన్ని చెలాయిస్తామంటే కుదరదని, రాజ్యాంగ సిద్ధాంతాల ప్రకారం దానిని నియంత్రించే పరిస్థితి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్, అప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు
అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను సాధించకపోయినా కూడా పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అలాగే, ఆయా పార్టీ నేత ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమితులైన సందర్భాలున్నాయి. 1994లో మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లే గెలుచుకున్నప్పటికీ, ఆ పార్టీ నేత పి.జనార్థన్‌రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది.
అలాగే, 2015లో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లే వచ్చినప్పటికీ ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదానిచ్చారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా రావాలంటే నిర్ధిష్టంగా ఇంత శాతం మేర సీట్లు గెలుపొంది ఉండాలని లేదు. అలాగే, కనీస సీట్ల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ హోదానివ్వడమన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయంగా లేదని జగన్ తన పిటిషన్‌లో వివరించారు. వివేకా హత్య కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెడతామని స్పష్టం
శాసనసభలో నాకు ప్రతిపక్ష నేత హోదానివ్వాల్సిన అవసరం గురించి నేను గతనెల 24న స్పీకర్‌కు అన్ని వివరాలతో లేఖ రాశాను. నిజానికి.. ఆయన మొదటినుంచీ నాపట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానే తప్ప చనిపోలేదని ఒకసారి.. నేను చచ్చేవరకు కొట్టాలని మరోసారి ఆయనన్నారు. పయ్యావుల కేశవ్ కూడా.. నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదని నిర్ణయించినట్లు మీడియాకు చెప్పారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలిఫికేషన్స్ చట్టం ప్రకారం నన్ను ప్రతిపక్ష నేతగా నియమించాల్సి ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నాకు ప్రతిపక్ష నేత హోదానిచ్చేలా ఆదేశాలివ్వండి.. లేని పక్షంలో మీరే ఆ హోదాను ఇస్తూ ఆదేశాలు జారీచేయండి’.. అని జగన్ తన పిటిషన్‌లో కోరారు.
(The above story first appeared on LatestLY on Jul 24, 2024 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

