CM Chandrababu Naidu Speech in Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు.
నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామని అన్నారు. పోలీసులు కూడా అలాంటి నేరస్తుడికి సహకరించారని ఆరోపించారు. ఆ నేరస్తుడి పాలనలో సీబీఐ వాళ్లు కూడా అరెస్ట్ చేయలేక వెనక్కి వచ్చారని వెల్లడించారు. కోడికత్తి డ్రామా చూశాం, గులకరాయి డ్రామా చూశాం... కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ, గులకరాయి డ్రామా పనిచేయలేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు.
వివేకా హత్య కేసు (Viveka Murder Case) అనేక మలుపులు తిరిగింది. హత్య జరిగాక ఘటనాస్థలికి సీఐ వెళ్లారు. సీబీఐకి విషయం తెలపడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి సీఐకి పదోన్నతి ఇచ్చింది. విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి. నేరస్థుడే సీఎం అయితే పోలీసులు కూడా వంత పాడే పరిస్థితి. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఈ బడ్జెట్, యూనియన్ బడ్జెట్‌పై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు
వివేకా హత్య కేసు నిందితుల అరెస్టుకు వెళ్లిన సీబీఐ సిబ్బందే వెనక్కి తిరిగి వచ్చారు. హు కిల్డ్ బాబాయ్ (Who Killed Babai) అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుంది. ప్రభుత్వ ఆదాయం ఐదేళ్లలో దోపిడీ జరిగింది. ఇసుక, మద్యం వంటివి రూ.లక్షల కోట్ల మేర దోపిడీ జరిగాయి. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. 2019 నుంచి రాష్ట్ర వృద్ధిరేటు పడిపోయింది. మూలధనాన్ని 60 శాతం మేర తగ్గించారు. జలవనరులపై 56శాతం, రోడ్లపై 85శాతం మూలధనం తగ్గింది. రాష్ట్రంలో తప్పకుండా రోడ్లను బాగు చేస్తాం. రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో ప్రవేశపెడతాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఒక వ్యక్తి ధనదాహం వల్ల ఎక్కడ చూసినా అవినీతి నెలకొంది. ధనదాహంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేశారు. అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్క మైనింగ్ లోనే రూ.20 వేల కోట్లు దోచుకున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అవినీతి డబ్బును రాష్ట్రమంతా పంచారు. ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్, రాజధాని అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన కేంద్రం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి వరాల జల్లు
అసమర్థ నిర్ణయాలతో రాష్ట్రం ధ్వంసమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధికి దూరం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు. రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారో తెలియడంలేదు. ప్యాలెస్ ను టూరిజం కోసం ఇవ్వాలని కొందరు అంటున్నారు. నాడు ప్రజావేదిక కూల్చారు... ఆ శకలాలను కూడా తొలగించలేదు. పులివెందుల మాదిరి రాష్ట్రాన్ని తయారుచేద్దామనుకున్నారు. పైశాచిక ఘటనలకు పాల్పడతారు... తిరిగి ఆ నేరం మనపైనే వేస్తారు. బాధితులనే నిందితులుగా చేసిన ఘనత వైసీపీది.
రాష్ట్రంలో హింసకు తావులేదు... తప్పు చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఇకపై రాష్ట్రంలో నేరస్తుల ఆటలు సాగవు. వ్యక్తిగత గొడవలను జగన్ రాజకీయం చేద్దామనుకున్నారు. అందుకే అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్లారు. నాడు సభలో నన్ను అవమానించారు. నాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారు. కానీ ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టాం. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా విస్తరించాయి. డ్రగ్స్, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. రాష్ట్రంలో నేరాలు చేయాలనుకుంటే ఊరుకునేది లేదు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.
ఎంతో వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రాన్ని పునర్ నిర్మించే బాధ్యత మాది. ఇటుక ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం. ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను తప్పకుండా నెరవేర్చుతాం. రాజధాని అమరావతి నిర్మాణం కచ్చితంగా పూర్తవుతుంది. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా లక్ష్యం... తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలనేదే నా ఆకాంక్ష. సూపర్-6 అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసేది లేదు.
త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 100 వరకు అన్న క్యాంటీన్లు నడిచేలా చూస్తాం. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను దుర్మార్గంగా తీసుకువచ్చారు. ఒక దుర్మార్గుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ చట్టమే ఉదాహరణ" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
పీవీ ఆర్థిక సంస్కరణలు దేశంలో పెనుమార్పులకు నాంది పలికాయి. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. నాడు ఐటీకి ప్రాధాన్యమిచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ తెలుగువాళ్లు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కనిపించే పరిస్థితి వచ్చింది. తెలుగువారు అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా ఎన్టీఆర్ చేశారు.
క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని మొదటగా పవన్ చెప్పారు. ఇద్దరం కలిసిన అనంతరం బీజేపీ కూడా ముందుకొచ్చింది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు నరకం చూశారు. మూడు పార్టీలు కలిశాక ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు..రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలిచ్చిన తీర్పు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవరకు సమష్టిగా ముందుకెళ్తామన్నారు.
అమరావతిని సర్వ నాశనం చేశారు. రాజధాని కలను చంపేశారు. అమరావతి దేవతల రాజధాని.. అలాంటిది నిన్నటి వరకు ఏమైందో మనం చూశాం. కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చి బడ్జెట్‌లో రూ.15వేల కోట్లు కేటాయించింది. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో కనిపిస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయి ఉంటే దాదాపు రెండు..మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద వచ్చి ఉండేది. ఈ రోజు అప్పులు చేయాల్సిన అవస్థ తీరేది.
టీడీపీ హయాంలో ఏపీ జీవనాడి పోలవరం 72శాతం పూర్తయింది. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారు. కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మార్చడం.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం చేశారు. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్ధిష్టమైన హామీ ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.