Amaravati and Modi and Chandrababu (Photo-Wikimedia/ANI)

New Delhi, July 23: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి రాజధాని నిర్మాణం అవసరం అని నమ్ముతున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది.  అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని తెలిపిన కేంద్రమంత్రి నిర్మల

ఈ సాయం రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగుతుందని నిర్మలమ్మ తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. పోలవరం ఏపీ జీవనాడిగా పేర్కొన్నారు. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ తెలిపారు. పారిశ్రామిక కారిడార్‌ల అభివద్ధికి ప్రాజెక్టులను ప్రకటించారు. విశాఖ-చెన్నయ్, హైదరాబాద్-బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.  పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, మోదీ టీం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్

ఏపీలో నాలుగు రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామని నిర్మల సీతారామన్ వెల్లడించారు. రాయలసీమ, ప్రకాశం, కోస్తా ఆంధ్రలలో వెనుకబడిన జిల్లాలకు ఆర్ధికసాయం అందిస్తామన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలను నిర్మల నెరవేరుస్తామన్నారు. పూర్వోదయ పథకం ద్వారా తూర్పు రాష్ట్రాలైన బిహార్, ఏపీ, జార్ఘండ్, బెంగాల్, ఓరిస్సాలకు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.