Newdelhi, Dec 13: సందర్భానికి తగినట్లు తమ డిస్ ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్ ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం వినూత్నంగా గూగుల్ డూడుల్ (Google Doodle 2024) ప్రదర్శించింది. భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ (D Gukesh) ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన నేపథ్యంలో ఈ డూడుల్ ని సిద్ధం చేసింది. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చివరి 14వ గేమ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా డింగ్ లిరెన్ పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు గుకేశ్.
Today's #GoogleDoodle... 'Celebrating Chess'.@DGukesh #WorldChessChampionship2024 pic.twitter.com/0aayCnYn5X
— Amit Paranjape (@aparanjape) December 13, 2024
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత..
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.