Hyderabad Horror: పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌ పై అత్యాచారం.. గుంటూరు యువకుడి ఘాతుకం.. హైదరాబాద్ లో కేసు

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ జూనియర్ ఆర్టిస్టు అతనికి దగ్గరైంది. తీరా ఆమెనూ గర్భవతిని చేసి ఆపై ముఖం చాటేసి తిరుగుతున్నాడు ఓ దుండగుడు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువకుడిపై హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Hyderabad Horror: పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌ పై అత్యాచారం.. గుంటూరు యువకుడి ఘాతుకం.. హైదరాబాద్ లో కేసు
Credits: Google

Hyderabad, Feb 18: పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ జూనియర్ ఆర్టిస్టు (Junior Artist) అతనికి దగ్గరైంది. తీరా ఆమెనూ గర్భవతిని (Pregnant) చేసి ఆపై ముఖం చాటేసి తిరుగుతున్నాడు ఓ దుండగుడు. దీంతో గుంటూరు జిల్లాకు చెందిన ఆ యువకుడిపై హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ (SR Nagar) పోలీస్ స్టేషన్‌లో (Police Station) కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల యువతి 2021లో హైదరాబాద్‌కు వచ్చి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తూ బోరబండలో ఉంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. హరహర నామస్మరణతో ఆలయాల్లో పెరిగిన రద్దీ.. భక్తుల రద్దీతో శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, శ్రీగిరి, వేములవాడ, కీసర, హన్మకొండ వేయిస్తంభాల ఆలయాలు కిటకిట.. వీడియోతో..

గుంటూరు జిల్లా కాకానికి చెందిన రోహిత్ ఖాన్ (24) ఆమె ఫోన్ నంబరు సంపాదించి పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని కోరింది. అప్పటి నుంచి రోహిత్ ఖాన్ తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు తాజాగా ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నేడు మహాశివరాత్రి.. ఈ పర్వదినం రోజు శివరాత్రి కోట్స్ తెలుగులో మీ కోసం అందిస్తున్నాం.. వెంటనే మీ బంధువులు, స్నేహితులకు పంపి విషెస్ చెప్పండి..

(The above story first appeared on LatestLY on Feb 18, 2023 09:15 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).