Hyderabad, Feb 18: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మహాశివరాత్రి (Mahashivaratri) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హరహర అంటూ ఆలయాలన్నీ (Temples) శివనామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. శివయ్యకు రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుంచే తరలిరావడంతో ఇరు రాష్ట్రాల్లోని శివాలయాల్లో రద్దీ నెలకొంది.
శ్రీశైలం, శ్రీకాళహస్తి, శ్రీముఖలింగం, శ్రీగిరి క్షేత్రంతోపాటు వేములవాడ రాజన్న, కీసర, హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక శోభ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.