Phool Protest in Karnataka Assembly (PIC @ Karnataka congress Twitter)

Bangalore, FEB 17: బసవరాజు బొమ్మై ప్రభుత్వానికి కర్ణాటక కాంగ్రెస్ నేతలకు వింత నిరసన తెలియజేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శుక్రవారం అసెంబ్లీకి చెవిల్లో పువ్వులతో (Phool Protest ) కనిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం, ప్రస్తుత విపక్ష నేత సిద్ధరామయ్యతో (Siddaramaiah) పాటు మరికొందరు నేతలు చెవిలో పూలు పెట్టుకుని సభకు వచ్చారు. మోసపూరిత హామీలు ఇచ్చి 2018లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని విమర్శగా వారు ఇలా చెవిలో పూలు పెట్టుకున్నారు. ఇక దీనితో పాటు శుక్రవారం కర్ణాటక ప్రభుత్వం బడ్జెట్ (Karnataka Budget) ప్రవేశ పెట్టింది. చాలా కాలంగా కర్ణాటక ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తోంది కాంగ్రెస్. దొరికిన ఏ అవకాశాన్ని వదలకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు.

ముఖ్యమంత్రి బొమ్మై (Bommai) ఈ విషయమై చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారంటే కాంగ్రెస్ నేతల ట్రోల్స్ ఏ రేంజులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం బొమ్మై, ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ ప్రవేశ పెడుతుండగా కాంగ్రెస్ నేతలు ఇలా చెవిలో పూలతో కనిపించడం మరింత చర్చనీయాంశమైంది.

Uddhav Thackeray Loses Shiv Sena: ఉద్దవ్ థాక్రేకు బిగ్ షాక్, శిండే వర్గమే అసలైన శివసేన అంటూ ఎన్నికల సంఘం ప్రకటన, గుర్తు కూడా ఏక్‌నాథ్ వర్గానిదే... 

ఇక బొమ్మై బడ్జెటును మోసపూరితమైందిగా కాంగ్రెస్ విమర్శించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత బడ్జెట్‭లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సగం పనులు కూడా పూర్తికాక ముందే 3లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఎందుకయ్యాయని బసవరాజ్ బొమ్మైని ప్రశ్నించారు. దీనిపై ఘాటుగా స్పందించిన బొమ్మై.. సిద్ధారామయ్య సీఎంగా ఉన్న సమయంలో కర్ణాటక చరిత్రలోనే ఎక్కువ అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని విమర్శించారు.