Shiv Sena supporter attempts suicide amid Maharashtra political crisis (Photo-ANI)

Mumbai, FEB 17: శివసేన (Shiv Sena) పార్టీ అధికారిక గుర్తు ఎవరిది?అనే దానిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. సీఎం ఏక్‌నాథ్‌ శిండే (Eknath Shinde) వర్గమే అసలైన శివసేన పార్టీ అని ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ వర్గానికే ‘విల్లంబులు’ గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పార్టీ కార్యాలయం కూడా శిందే వర్గానికే శిండే చెందే అవకాశం ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విల్లంబుల గుర్తుపై గెలిచిన ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రస్తుతం ఏక్‌నాథ్‌ శిండేకే ఉందని ఈసీ (Election commision) పేర్కొంది. ఈ మేరకు 78 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా గత ఉప ఎన్నికల్లో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి కేటాయించిన ‘ఫ్లేమింగ్‌ టార్చ్‌’ గుర్తును ఆ వర్గం కొనసాగించుకోవచ్చని తెలిపింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే హర్షం వ్యక్తం చేశారు. " ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే లెక్కలోకి తీసుకుంటారు. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలా సాహెబ్‌ ఠాక్రే వారసత్వ విజయం. మాదే నిజమైన శివసేన’’ అని అన్నారు.

MLA Poaching Case: సీబీఐని కేంద్రం నియంత్రిస్తుంది, అలాంటప్పుడు ఈ కేసును ఎలా అప్పగిస్తారు, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది దవే వాదనలు, కేసు విచారణ ఈనెల 27కి వాయిదా 

దాదాపు ఎనిమిది నెలల క్రితం కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి శివసేన నుంచి ఏక్‌నాథ్‌ శిండే బయటకు రావడంతో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో శిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిందే వర్గాల మధ్య పార్టీ గుర్తు కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ వివాదం చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ అధికారిక గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఈ రెండు వర్గాలకు వేర్వేరు గుర్తులను కేటాయించింది. అయితే, విల్లంబుల గుర్తు ఎవరిది? అనే విషయంపైతీసుకునే అంశాన్ని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘానికే వదిలిపెట్టింది. వివిధ చర్చలు, రాజ్యాంగ పరమైన అంశాలను పరిశీలించిన తర్వాత శివసేన పార్టీ అధికారిక గుర్తు విల్లంబులను శిండే వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.