Vemulawada, Aug 5: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న దేవాలయం(రాజరాజేశ్వర స్వామి)లో వీఐపీ బ్రేక్ దర్శనం నేటి నుండి ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు. వీఐపీ బ్రేక దర్శన టికెట్ ధర రూ.300గా ఉండగా ఈ టికెట్ తీసుకున్న వారికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు.
బ్రేక్ దర్శన సమయం ప్రతిరోజు ఉదయం 10 :15 గంటల నుంచి 11: 15 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటలుగా నిర్ణయించారు. ఇకపై ఈవో కార్యాలయం ముందున్న శీఘ్ర దర్శనం క్యూలైన్‌ను బ్రేక్ దర్శనానికి ఉపయోగించనున్నారు. ఇదే మార్గంలో ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఆలయాన్ని డెవలప్ చేసి తీరుతానని తెలిపారు ఆది శ్రీనివాస్. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరై, వెనక్కి వెళ్లిన రూ. 20 కోట్లను తిరిగి తెప్పించానని తెలిపారు. వీడియో ఇదిగో, రైలు వస్తున్నా గుర్తించలేక పట్టాలపై నడిచిన మతిస్థిమితం లేని మహిళ, రిస్క్ చేసి ప్రాణాలు కాపాడిన మధిర ఆర్కే ఫౌండేషన్ సభ్యులు
ఆలయ అభివృద్ధి సూచనల కోసం శృంగేరి పీఠం సహకారం కోరామని తెలిపారు. రూ. 50 కోట్లతో చేపట్టే పనులకు అంచనాలను రూపొందించున్నామని గత పాలకులు ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఆధ్యాత్మికత ఉట్టి పడే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఆది శ్రీనివాస్.