Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. సెప్టెంబరు 1 వరకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణలో సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది.

Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. సెప్టెంబరు 1 వరకు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు.. ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
AP Rains (photo-Video Grab)

Hyderabad, Aug 27: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మళ్లీ వర్షాలు (Rains) పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) (IMD) వెల్లడించింది. తెలంగాణలో (Telangana) సెప్టెంబరు 1 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని ఐఎండీ వివరించింది. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆ మేరకు పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో పొడి వాతావరణం మరికొన్ని రోజుల పాటు కొనసాగనుందని తెలిపింది.

Amit Shah: నేడే తెలంగాణకు అమిత్ షా.. ఖమ్మం జిల్లాలో బీజేపీ రైతు సభలో పాల్గొననున్న హోం మంత్రి.. చివరి నిమిషంలో రద్దయిన భద్రాచల రాములవారి దర్శనం షెడ్యూల్

ఏపీలోనూ వానలు

ఏపీలో వచ్చే మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశముందని తెలిపింది.

Congress SC, ST Declaration: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు, ఆర్ధిక సాయం పెంచుతామంటూ హామీ, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసిన ఖర్గే

(The above story first appeared on LatestLY on Aug 27, 2023 06:26 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).