Amit Shah (Photo Credit- PTI)

Hyderabad, Aug 27: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు తెలంగాణకు  (Telangana) రానున్నారు. అయితే షా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన నేడు సాయంత్రం ఖమ్మంలో (Khammam) జరిగే బీజేపీ రైతు సభలో పాల్గొంటున్నారు. భద్రాచల రాములవారిని దర్శించుకునేలా మొదట షెడ్యూల్ సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అమిత్ షా భద్రాచలం పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కారణాలు తెలియాల్సి ఉంది.

Congress SC, ST Declaration: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వస్తే దళిత, గిరిజనులకు రిజర్వేషన్లు, ఆర్ధిక సాయం పెంచుతామంటూ హామీ, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ స్పష్టం చేసిన ఖర్గే

మారకముందు షెడ్యుల్ ఇలా ఉండేది..

ఆదివారం తొలుత ఢిల్లీ నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి భద్రాచలం వచ్చి  సీతారామచంద్రులను దర్శించుకునేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ భద్రాచలం పర్యటన రద్దయినట్లు శనివారం సాయంత్రం యంత్రాంగం ప్రకటించింది. కేవలం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభకు మాత్రమే అమిత్ షా హాజరవుతున్నట్లు ప్రకటన వెలువడింది.

Viral Video: వరంగల్‌లో దారుణం, ఫుల్ బాటిల్ కావాలని తల్వార్‌తో బెదిరిస్తూ మందుబాబు హంగామా..