Kidney Racket In Vijayawada: రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. చివరకు రూ. లక్ష చేతిలో పెట్టి బెదిరింపులు.. విజయవాడలో భారీ మోసం

విజయవాడలో కిడ్నీ రాకెట్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే, రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ ఎదురితిరిగి బెదిరించింది.

Kidney Racket In Vijayawada: రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. చివరకు రూ. లక్ష చేతిలో పెట్టి బెదిరింపులు.. విజయవాడలో భారీ మోసం
Kidney Racket In Vijayawada (Credits: X)

Vijayawada, July 9: విజయవాడలో (Vijayawada) కిడ్నీ రాకెట్‌ (Kidney Rocket) తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే, రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ ఎదురితిరిగి బెదిరించింది. దీంతో బాధితుడు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు చిరు వ్యాపారి. కరోనా సంక్షోభంతో వ్యాపారం దెబ్బతింది.

ఆ తర్వాత చేసిన మిగతా వ్యాపారాలు కూడా ఏమీ కలిసిరాలేదు. దీంతో రెండు మూడేండ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. పెద్దయెత్తున అప్పులయ్యాయి. ఈ క్రమంలో మధుబాబుకు విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పరిచయమయ్యాడు. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. 30 లక్షల డబ్బు వస్తే తన సమస్యలు అన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు.

బిగ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు వానలు

కుట్ర ఇలా..

మధుబాబు ఒప్పుకోవడంతో ఆపరేషన్ కు రెండు నెలల ముందుగానే మధుబాబు సమాచారాన్ని, వివరాలను భాషా మార్ఫింగ్ చేశాడు. ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని కు తీసుకెళ్లి ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నాడు. ఆపరేషన్‌ తర్వాత మధుబాబుకు రూ. 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 1.10 లక్షలు మాత్రమే బాషా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు అడిగేసరికి బాషా తన నిజస్వరూపం బయటపెట్టాడు.

రక్త సంబందీకుడిగా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు. కాబట్టి నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్‌ శరత్‌ బాబు, మధ్యవర్తి బాషా ముఠాగా ఏర్పడి తనను బెదిరిస్తున్నట్టు ఆరోపించాడు.

(The above story first appeared on LatestLY on Jul 09, 2024 11:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).