Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మొత్తం నిందితుల జాబితా ఇదే, ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఏ-18గా మైత్రీ మూవీస్
పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు
Hyd, Dec 24: పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు పుష్ప-2ను నిర్మించిన మైత్రీ మూవీస్‌ను ఏ-18గా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఏ-1 నుంచి ఏ-8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, ఏ-9, ఏ-10గా థియేటర్ సెక్యూరిటీ, ఫ్లోర్ ఇంఛార్జ్‌లను నిందితులుగా చేర్చారు. ఏ-12 నుంచి ఏ-17 వరకు అల్లు అర్జున్ బౌన్సర్లను, ఫ్యాన్స్ అసోసియేషన్ నేతను చేర్చారు.
తొక్కిసలాట కేసులో నిందితులు : ఏ-1గా అగమాటి పెదరామిరెడ్డి (థియేటర్ ఓనర్), ఏ-2గా అగమాటి చిన్నరామిరెడ్డి (థియేటర్ ఓనర్), ఏ3గా ఎం.సందీప్(పార్ట్‌నర్), ఏ-4గా సుమిత్ (పార్ట్‌నర్), ఏ-5గా అగమాటి వినయ్ (పార్ట్‌నర్), ఏ-6గా అశుతోష్ రెడ్డి (పార్ట్‌నర్), ఏ-7గా రేణుకాదేవి (పార్ట్‌నర్), ఏ-8గా అరుణారెడ్డి (పార్ట్‌నర్), ఏ-9గా నాగరాజు (మేనేజర్), ఏ-10గా విజయ్‌చందర్ (లోయర్ బాల్కానీ ఇన్‌చార్జ్) ఉన్నారు.
Here's List
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుపై పోలీసుల విచారణ.
A11గా అల్లు అర్జున్ A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్.
A9, A10 సెక్యూరిటీ సిబ్బంది సంధ్య. ఫ్లోర్ ఇన్‌చార్జ్.
A12 నుంచి A17వరకు అల్లు అర్జున్ బౌన్సర్లు. A18గా మైత్రి మూవీమేకర్స్‌ను చేర్చిన… pic.twitter.com/vrn8Y7tS0Y
— Aadhan Telugu (@AadhanTelugu) December 24, 2024
ఏ-11గా అల్లు అర్జున్, ఏ-12గా సంతోష్ (అల్లు అర్జున్ పీఏ), ఏ-13గా శరత్ బన్నీ (అల్లు అర్జున్ మేనేజర్), ఏ-14గా రమేశ్ (సెక్యూరిటీ టీమ్), ఏ-15గా రాజు (సెక్యూరిటీ టీమ్), ఏ-16గా వినయ్ కుమార్(ఫ్యాన్స్ అసోసియేషన్), ఏ-17గా ఫర్వేజ్(బాడీగార్జ్), ఏ-18గా మైత్రీ మూవీస్ నిర్మాతలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Dec 24, 2024 07:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

