Telangana Elections: సీఎం కేసీఆర్ పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ.. కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు.. కామారెడ్డిలో ఆసక్తికర రాజకీయం
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు.
Kamareddy, Nov 3: కామారెడ్డిలో (Kamareddy) సీఎం కేసీఆర్‌పై (CM KCR) పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు (Poultry Farmers) గురువారం వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓన్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రావు, ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ పై పౌల్ట్రీ రైతుల అభ్యర్థి పోటీ https://t.co/XP5F9L69Bu
— vogotikirankumar (@vogotkirankumar) October 11, 2023
KCR Vs 1016 : కామారెడ్డిలో కేసీఆర్‌పై 1016 మంది పోటీ.. లబానా కాయితీ లంబాడీలు రెడీ?#KCR #kamareddy #AssemblyElections2023 #HashtagUhttps://t.co/uSNNqGti3z
— Hashtag U (@HashtaguIn) October 3, 2023
కాయితీ లంబాడీలు ఇలా..
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి ఇప్పటికే కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
(The above story first appeared on LatestLY on Nov 03, 2023 08:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

