Heart Attack: తనకేదో అవుతోందంటూ నానమ్మను నిద్రలేపిన 13 ఏళ్ల బాలిక.. మంచంపై కూర్చుని అలాగే ఒరిగిపోయి మృతి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. బాలిక ప్రాణం తీసిన గుండెపోటు
డ్యాన్సు చేస్తుండగా కొందరు, ఆడుకుంటూ కొందరు, జిమ్‌లో వ్యాయామం చేస్తూ మరికొందరు ఇలా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న యువకులు కోకొల్లలుగా మారారు.
Mahabubabad, April 1: డ్యాన్సు (Dance) చేస్తుండగా కొందరు, ఆడుకుంటూ కొందరు, జిమ్‌లో (Gym) వ్యాయామం చేస్తూ మరికొందరు ఇలా గుండెపోటుతో (Heart Attack) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న యువకులు కోకొల్లలుగా మారారు. గతంలో సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండెపోటు ఇప్పుడు పసిపిల్లల ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తోంది. గుండెపోటుకు గురై ఇటీవల పలువురు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మీరు చదివే వార్త అంతకుమించి బాధించే ఘటన. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని బోడతండాలో ఇది జరిగింది.
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి#heartattack #telangana #eenadu #TeluguNews https://t.co/ofoMhCRNr2
— Eenadu (@eenadulivenews) April 1, 2023
తండాకు చెందిన స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. గురువారం శ్రీరామ నవమి స్కూలుకు సెలవు కావడంతో స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంది. రాత్రి నిద్రపోయిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైంది. తనకేదో అవుతోందంటూ నానమ్మను నిద్రలేపింది. మంచంపై కూర్చుని ఒక్కసారిగా ఒరిగిపోయింది. తల్లిదండ్రులు వెంటనే కుమార్తెను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందడంతో బోరున విలపించారు. గుండెపోటే స్రవంతి మరణానికి కారణంగా వైద్యులు చెప్పారు. బాలిక మృతితో తండాలో విషాదం నెలకొంది.
(The above story first appeared on LatestLY on Apr 01, 2023 08:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

