Hyderabad, April 1: ఇప్పటికే గ్యాస్ (Gas), పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలతో కుదేలైన సామాన్యులకు పిడుగు లాంటి వార్తా. తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) ప్రయాణికుల నెత్తిన నేటి నుంచి అదనపు భారం పడనుంది. ఇటీవల కేంద్రం పెంచిన ఐదుశాతం టోల్ చార్జీలను (Toll Charges) ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచే ఇది అమల్లోకి రానుండడంతో ప్రయాణికులు అదనంగా చెల్లించుకోక తప్పదు.
TSRTC టికెట్ ధరలు పెంపు! https://t.co/HCJg4bgRCy pic.twitter.com/O638zN1Knm
— Ashok Vaddipuri Venkatesh (@AshokVaddipuri) April 1, 2023
ఏ బస్సులో.. ఎంత చార్జీల పెంపు అంటే?
- గరుడ ప్లస్ మొదలు ఆర్డినరీ బస్సుల వరకు ఒక్కో టికెట్‌పై 4 రూపాయలు
- నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ. 15
- ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20
- సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ. 4