Twitter to Remove Blue Ticks (PIC @ Twitter)

New Delhi, March 31: ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్లకు అలర్ట్.. మీ ట్విట్టర్ అకౌంటుకు బ్లూ టిక్ ఉందా? అయితే, ఏప్రిల్ 1 నుంచి వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లలో బ్లూ టిక్ కనిపించదు. ఎందుకంటే.. (Twitter Blue Tick) అని పిలిచే లెగసీ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను ట్విట్టర్ అకౌంట్ల నుంచి తొలగించనుంది. తద్వారా ట్విట్టర్ తమ బ్లూ టిక్ సేల్స్ పెంచుకోనుంది. గత ఏడాదిలో ఎలన్ మస్క్ (Elon Musk) ద్వారా ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత, కంపెనీ యూజర్‌బేస్, ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ప్రణాళికలను ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన కీలక అప్‌డేట్‌లలో ఒకటి.. ట్విట్టర్ బ్లూ సబ్‌స్ర్కిప్షన్ (Twitter Blue Subscription). ట్విట్టర్ అందించే బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌లో లాంగ్-ఫార్మ్ ట్వీట్‌లు (280 అక్షరాలకు పైగా), ట్వీట్‌లను (Undo/Edit) చేయడం వంటి డిమాండ్ ఉన్న ఫీచర్‌లు ఉన్నాయి. ఆ తర్వాత, సబ్‌స్క్రిప్షన్‌ను మరింత ఆకర్షణీయంగా అందించడానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ (Twitter Blue Users) బ్లూ టిక్‌ను అందించనుందని మస్క్ చెప్పాడు.

మరో మాటలో చెప్పాలంటే.. ట్విట్టర్ యూజర్లు తమ మొబైల్ నంబర్‌ను అందించడంతో పాటు నెలవారీ రుసుమును చెల్లించడం ద్వారా ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫై చేసుకోవచ్చు. లెగసీ అకౌంట్ల నుంచి వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను తొలగించాలనే ట్విట్టర్ నిర్ణయం వెనక మస్క్ గ్రాండ్ ఏప్రిల్ ఫూల్ (April Fool) అయి ఉంటుందని అందరూ భావించారు. కానీ, అది ఊహాగానాలు మాత్రమే. ట్విట్టర్ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. లెగసీ అకౌంట్లలో బ్లూ టిక్ మార్క్‌ను తొలగించనుంది.

Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు మళ్లీ డౌన్, లాగిన్ సమస్యలు ఎదుర్కుంటున్న వినియోగదారులు, ట్విట్టర్‌లో మీమ్స్‌తో హడావుడి 

మీ వెరిఫైడ్ అకౌంట్ స్టేటస్ సేవ్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం ఒకటే.. (Twitter Blue) సభ్యత్వాన్ని కొనుగోలు చేయడమే. మీకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేదా ఐఫోన్లు ఉంటే.. ధర రూ.900 చెల్లించడం ద్వారా ట్విట్టర్ బ్లూ టిక్ పొందవచ్చు. అదేవిధంగా, వెబ్ (Web) ద్వారా సబ్‌స్క్రయిబ్ చేస్తే.. ధర రూ. 650కి తగ్గుతుంది. వెబ్ సబ్‌స్క్రైబర్‌లు (Twitter Web Subscribers) ఎలాంటి ఫీచర్‌లను కోల్పోవాల్సి ఉండదు. అయితే, యాప్‌లో కొనుగోళ్లపై (Microsoft) బ్రౌజర్ డెవలపర్ల నుంచి ఎలాంటి కమీషన్ ఉండదు. అందుకే ఇది చాలా చౌకగా ఉంటుంది. మీరు ఏదైనా సబ్‌స్క్రిప్షన్ లేదా యాప్ సర్వీస్‌ను కొనుగోలు చేస్తే.. (Apple), (Google) 30 శాతం కమీషన్ రుసుమును వసూలు చేస్తాయి. మరోవైపు, ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కారణంగా వెరిఫై అయిన యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్‌గా ఉన్నంత వరకు బ్లూ టిక్ మీ ప్రొఫైల్‌లో అలాగే ఉంటుందని గమనించాలి.