Hyderabad: ఫంక్షన్‌కు వెళ్లి ఏడేళ్ల బాలుడు మిస్సింగ్, ఉదయం నుంచి వెతికినా దొరకకపోవడంతో పోలిస్‌ కంప్లైంట్, చివరికి బాలుడు ఎక్కడ దొరికాడంటే?

వివాహ వేడుకలో విషాదం నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ లోని (Shamshabad) ఓ ఫంక్షన్ హాల్ లో ఏడేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు (Boy Died Suspiciously). వివాహ వేడుకలకు హాజరైన నందిగామకు చెందిన దంపతుల కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు.

Hyderabad: ఫంక్షన్‌కు వెళ్లి ఏడేళ్ల బాలుడు మిస్సింగ్, ఉదయం నుంచి వెతికినా దొరకకపోవడంతో పోలిస్‌ కంప్లైంట్, చివరికి బాలుడు ఎక్కడ దొరికాడంటే?
Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad, AUG 31: వివాహ వేడుకలో విషాదం నెలకొంది. హైదరాబాద్ శంషాబాద్ లోని (Shamshabad) ఓ ఫంక్షన్ హాల్ లో ఏడేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు (Boy Died Suspiciously). వివాహ వేడుకలకు హాజరైన నందిగామకు చెందిన దంపతుల కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాలుడు మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఫంక్షన్ హాల్ నిర్వాహకులపై అనుమానంతో రోడ్డుపై బాలుడి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.

Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి 

ఫంక్షన్ లో అందరూ బిజీగా ఉన్న సందర్భంలో అప్పటివరకు చిన్నారులతో ఆడుకున్న బాలుడు విజిత్ రెడ్డి కనిపించడం లేదంటూ శ్రీకాంత్ రెడ్డి దంపతులు ఫంక్షన్ హాల్ మొత్తం వెతికారు. చివరికి ఫంక్షన్ లోని సంపులో బాలుడు విజిత్ రెడ్డి విగత జీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఫంక్షన్ హాల్ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు విజిత్ రెడ్డి సంపులో పడి చనిపోయినట్లుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ఫంక్షన్ హాల్ బయట రోడ్డుపై బైఠాయించి బాలుడి కుటుంసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

(The above story first appeared on LatestLY on Aug 31, 2023 09:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).