CM KCR (Photo-Twitter/TS CMO)

Hyderabad, May 20: దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొని టీఆర్ఎస్ (TRS) నుంచి బీఆర్ఎస్ (BRS) గా మారిన కేసీఆర్ పార్టీ (KCR Party) తెలంగాణకు ఆవల తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో (Maharastra) ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం (BRS Training Camp) ప్రారంభమైన తొలి రోజే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

PM Modi Unveils Bust of Mahatma Gandhi: హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వీడియో ఇదిగో

గెలిచింది ఎవరంటే?

ఔరంగాబాద్ సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు గురువారం ఉప ఎన్నిక జరగ్గా నిన్న ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో గెలుపు సంబురాలు అంబరాన్నంటాయి.

RR Vs PBKS: రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం, పంజాబ్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం, అర్ధసెంచరీలతో మెరిసిన యశస్వీ, పడిక్కల్