Dharmashala, May 19: ఐపీఎల్ 2023 (IPL 2023)లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని రాజస్థాన్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే.. మిగిలిన జట్ల ఫలితాల బట్టి రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరేది లేనిది తెలుస్తుంది. రాజస్థాన్ బ్యాటర్లలో ((Rajasthan Royals) ) యశస్వి జైస్వాల్(50; 36 బంతుల్లో 8 ఫోర్లు), పడిక్కల్(51; 30 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించగా ఆఖర్లో షిమ్రాన్ హెట్మెయర్(46; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రియాన్ పరాగ్(20; 12 బంతుల్లో 1ఫోర్, 2సిక్సర్లు) దూకుడుగా ఆడారు.
The @rajasthanroyals stay alive in the season courtesy of a remarkable chase 🙌#RR clinch a 4-wicket victory in Dharamsala 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/3cqivbD81R #TATAIPL | #PBKSvRR pic.twitter.com/rXvH1o0uf1
— IndianPremierLeague (@IPL) May 19, 2023
పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా, సామ్‌కరన్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కరన్(49 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ(44; 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షారుక్ ఖాన్(41 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు.
మిగిలిన వారిలో లివింగ్ స్టోన్(9), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(2)లు విఫలం కాగా.. ధావన్(17), అథర్వ తైదే(19) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ మూడు వికెట్లు తీయగా, బౌల్ట్, జంపా చెరో వికెట్ పడగొట్టారు.