CM KCR Interesting Comments: ఆ పనికంటే నాకు సీఎం పదవి గొప్ప కాదు, తెలంగాణ ప్రజల కోసమే నా తండ్లాట, జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం
Hyderabad, NOV 26: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీసుకువచ్చిన పేరే ఆకాశమంత పెద్దదని.. దాన్ని మించిన పదవి ఉన్నదా? నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి నాకు చాలు’ అంటూ వ్యాఖ్యానించారు. జగిత్యాల బీఆర్‌ఎస్ (KCR Meeting) ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలా క్లియర్‌గా జగిత్యాలలో చెబుతున్నా. చాలా మందికి తెలుస్త లేదు. నాకేం కావాలి..? తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశమంత పెద్దది. దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చారు కాబట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా. నా అంత ఎక్కువ కాలం పని చేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడూ లేడు. ఈ కీర్తి చాలు నాకు’ అన్నారు.
నా తండ్లాటంతా తెలంగాణ కోసమే ✊
- జగిత్యాల సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ #KCROnceAgain#VoteForCar pic.twitter.com/NKBSA9y5u1
— BRS Party (@BRSparty) November 26, 2023
నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు 70 ఏళ్ల వయసు వచ్చింది. ఇంకా ఈ జీవితంలో. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది. పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి ఆలోచించి ఓటేయాలి తప్ప ఆగమై ఓటు వేయొద్దని మనవి చేస్తున్నా. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో చర్చ పెట్టండి.. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టండి.. తప్పకుండా బీఆర్‌ఎస్ పార్టీకి ఘనవిజయాన్ని చేకూర్చండి. సంజయ్ అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తాం. వందశాతం చేయించే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నా. సంజయ్‌ని పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నా’నన్నారు.
(The above story first appeared on LatestLY on Nov 26, 2023 10:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

