KCR to Yadadri: నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ దంపతులు.. స్వర్ణతాపడానికి కిలో 16 తులాల బంగారం సమర్పణ.. మధ్యాహ్నం 3.30 గంటలకి హైదరాబాద్ తిరుగు ప్రయాణం
తెలంగాణ సీఏం కేసీఆర్ శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పిస్తారు.
Hyderabad, September 30: తెలంగాణ (Telangana) సీఏం కేసీఆర్ (CM KCR) శుక్రవారం యాదాద్రి (Yadadri) పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం (Gold) సమర్పిస్తారు. ఇందుకోసం రోడ్డు మార్గం గుండా ప్రగతిభవన్ (PragathiBhavan) నుంచి బయల్దేరి యాదాద్రికి చేరుకోనున్నారు. ఉదయం గం. 11.30కి యాదాద్రిలోని ప్రెసిడెన్షియల్ సూట్ కు సీఎం దంపతులు చేరుకుంటారు.
అక్కడి నుంచి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఆలయంలో భోజనం చేసిన తర్వాత గం. 3.30కి సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. యాదాద్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 5న జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
(The above story first appeared on LatestLY on Sep 30, 2022 08:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

