AdiPurush (Source Image: Twitter)

Hyderabad, September 30: ప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్‌' (Adipurush) ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం ఉదయం చిత్ర బృందం షేర్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ (Prabhas) పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ''మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి. అయోధ్యలోని సరయు నది ఒడ్డున జరగనున్న 'ఆదిపురుష్‌' టీజర్‌ లాంచ్‌లో పాల్గొనండి. అక్టోబర్‌ 2న రాత్రి 7.11 గంటలకు టీజర్‌ విడుదల చేయనున్నాం'' అని దర్శకుడు ఔంరౌత్‌ (Om Raut) పేర్కొన్నారు.

ఆ హీరో ఆఫీసు నుంచే ఇదంతా, 18 యూట్యూబ్‌ చానళ్లపై కేసు పెట్టిన మంచు విష్ణు, నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారని వెల్లడి

రామాయణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ప్రభాస్‌ రాముడిగా, సీత పాత్రలో బాలీవుడ్‌ నటి కృతిసనన్‌, రావణాసురుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.